కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా సోకింది. ఈ మేరకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వాట్సాప్ ద్వారా వెల్లడించారు. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కొకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వైద్యపరీక్షల్లో 14 పాజిటివ్, 10 నెగిటివ్, ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన బాధితుల సంఖ్య 58కి చేరింది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకూ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు లేదు. ఏలూరులో 8, భీమవరంలో 2, ఉండిలో 1, గుండుగొలనులో 1, పెనుగొండలో 1 కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా