పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వాయినాలు ఇవ్వడానికి మా ఇంటికి రావద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్లెక్సీ అందరినీ ఆలోచింపజేస్తోంది. భీమవరంలోని గునుపూడి ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ తమ ఇంటికి ఎవరు వాయినానికి రావద్దని, తాము ఈ సంవత్సరం వ్రతాలు, నోములు చేయడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కరోనా ఎఫెక్ట్: వాయినాల కోసం మా ఇంటికి ఎవరూ రావద్దని ఫ్లెక్సీ - భీమవరంలో వాయినాల కోసం ఇంటికి రావద్దని ఫ్సెక్సీ
భీమవరంలో ఓ ఫ్లెక్సీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది మేము వ్రతాలు, నోములు చేయట్లేదు.. మా ఇంటికి ఎవరూ వాయినాలకు రావద్దూ..అంటూ ఆ ఫ్లెక్సీలో రాసుంది. కరనా వ్యాప్తితో అయినవారికి నోటితో చెప్పలేక ఇలా ఏర్పాటు చేశామని చెబుతున్నారు లక్ష్మి.
corona effect vaayanam banner in bheemavaram
శ్రావణ మాసంలో చుట్టుపక్క వీధుల్లోని మహిళలు పసుపు కుంకుమ, వాయనం ఇచ్చేందుకు తమ ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తమ ఇంటికి ఎవ్వరినీ రావొద్దని నోటితో చెప్పలేక.. బాగా ఆలోచించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని తెలిపారు.
Last Updated : Jul 20, 2020, 9:27 PM IST
TAGGED:
భీమవరం తాజా వార్తలు