ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గృహ నిర్బంధంలో పోలీసులు.. కారణం? - పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల క్వారంటైన్

లాక్​డౌన్​ నేపథ్యంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పోలీస్ స్టేషన్​పై కరోనా ప్రభావం పడింది. అక్కడి సిబ్బందిని స్వీయ నిర్బంధంలో ఉండాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​ కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలిన కారణంగా... స్టేషన్​లో పని చేస్తున్న 19 మంది బయట తిరగొద్దంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Corona effect on police station at west godavari
పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల క్వారంటైన్

By

Published : Apr 3, 2020, 12:32 PM IST

Updated : Apr 3, 2020, 2:51 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల క్వారంటైన్

ఓ పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​ కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని వల్ల పోలీస్​స్టేషన్​లోని సిబ్బంది అంతా గృహ నిర్బంధంలో ఉండాలంటూ ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పోలీస్​స్టేషన్​పై కరోనా ప్రభావం పడింది. ఈ పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి రాగా.. అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుడిని సమీపంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్, అతని కుటుంబసభ్యుల్ని 28 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు.

వారి ప్రభావం మిగిలిన సిబ్బందిపైనా పడింది. అక్కడ పని చేసే పోలీసులందరూ గృహ నిర్బంధంలో 28 రోజులు ఉండాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు క్వారంటైన్​లో ఉన్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ .విశ్వనాథన్ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ స్టేషన్​లోని 19 మందిని ఈనెల 28 వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని... స్వీయ గృహనిర్బంధంలో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Apr 3, 2020, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details