కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి దేవి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో కార్మికులు తయారు చేసిన కోట్ల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లోనే రూ.50 లక్షల విలువైన నిల్వలున్నాయన్నారు. పేరుకుపోయిన నిల్వలను ఆగస్టు నెలలోనే ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. నెరవేరలేదన్నారు. ఫలితంగా సహకార సంఘాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, కార్మికులకు కనీసం ఉపాధి కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.
'చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది' - చేనేత రంగంపై కొవిడ్ ప్రభావం వార్తలు
కరోనా కారణంగా రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని.. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి అన్నారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
వావిలాల సరళాదేవి దేవి
ముడి సరకు లేక, ఉపాధి లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. చేనేత సహకార సంఘాల్లోని వస్త్ర నిల్వలు కొనుగోలు చేసి.. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:సూర్యారావుపాలెం పీఏసీఎస్‌లో భారీ కుంభకోణం