మందేస్తే.. ఎవరిని లెక్క చేయరు. కరోనా దెబ్బకు.. కల్లు కోసం లాక్డౌన్ కూడా పట్టించుకోని పరిస్థితి. కరోనా ప్రభావం తమకు లెక్క లేనట్లుంది కల్లు బాబుల తీరు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ఓ గీత కార్మికుడు ఈత చెట్టు ఎక్కాడు. ఆయన కిందకు దిగకుండానే కల్లు బాబులు ఎగబడుతున్నారు. ముందు మాకేనంటూ కొందరైతే చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మందు బాబులకు నాలుక పీకేస్తున్నట్లు ఉంది.. ఇలా.. కల్లు కోసం ఆరాటపడుతున్నారు. దీంతో కల్లుకు గిరాకీ ఏర్పడింది. ఉదయమే చెట్టు వద్దు వెళ్లి కల్లు కోసం కాచుకు కూర్చుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల మేరకు కల్లు గీయరాదన్న హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు.
చెట్టు నువ్వెక్కుతావా.. మమ్మల్నే ఎక్కమంటావా? - కల్లు గీత కార్మికులు న్యూస్
హే మేం ముందొచ్చాం. మాకు పోయి కల్లు.. మేం పొద్దున్నుంచే.. నీ కోసం ఇక్కడే కూర్చొని ఉన్నాం.. మాకు కాకా ఇంకా ఎవరికి పోస్తావ్ కల్లు. నువ్వు చెట్టు దిగుతావా.. లేక మేమే.. పైకి రావాలా? ఇదండి కల్లు బాబుల గోల. కరోనా దెబ్బకు వైన్ షాపులు మూతపడితే.. జనం చెట్లు.. గట్ల వెంటే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందు లేక నాలుక పీకేస్తుందేమో.. ఏం చేస్తారు మరీ!
corona effect on drinkers