ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజృంభిస్తున్న మహమ్మారి.. కొత్తగా 42 కంటైన్మెంట్ జోన్లు - పశ్చిమ గోదావరిలో కరోనా

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 207 పాజిటివ్ కేసులు వచ్చాయి. జిల్లాలో కొత్తగా 42 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.

corona cases increasing in west godavari
పశ్చిమ గోదావరిలో కరోనా కేసులు

By

Published : Jul 15, 2020, 5:52 PM IST

Updated : Jul 15, 2020, 6:00 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారీ అంతకంతకు విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 207 పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. కేవలం పదిరోజుల వ్యవధిలోనే జిల్లాలో 15వందల కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,233కు చేరుకోగా.. ఇందులో 1,053మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,148 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాలోని ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అత్యవసర దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో 42 కొత్త కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవంజి: రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి

Last Updated : Jul 15, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details