పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండల పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన దహన కార్యక్రమానికి హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మండలంలో మొదటి కేసు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ప్రశాంత పల్లెలో కరోనా కలకలం...అప్రమత్తమైన అధికారులు ! - ప్రశాంత పల్లెలో కరోనా కలకలం...అప్రమత్తమైన అధికారులు !
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండల పరిధిలోని ఓ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గ్రామంలో జరిగిన దహన కార్యక్రమానికి హాజరైన వ్యక్తికి పాజిటివ్ రావడంతో అధికారులు పోలీసులు ,వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
ఒడిశాలోని జేపూర్ క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వ్యక్తి తన సోదరి మరణవార్త విని అక్కడ నుంచి తప్పించుకున్నాడు. విశాఖ అపోలో ఆస్పత్రిలో తన సోదరి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అతను తన భార్యతో కలిసి ఆస్పత్రికి చేరుకుని అక్కడి నుంచి తన సోదరి మృతదేహాన్ని తీసుకుని ఈ నెల 23న కారులో తన సొంత గ్రామమానికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి దహన కార్యక్రమాలు నిర్వహించారు.
25న తన భార్యతో కలిసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు వారిని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. ఆ కార్యక్రమానికి ఎంత మంది హాజరయ్యారు... ఏ ప్రాంతం నుంచి వచ్చారని వివరాలను సేకరిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టారు.