ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశాంత పల్లెలో కరోనా కలకలం - ప్రశాంత పల్లెలో కరోనా కలకలం

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలంలో కరోనా కేసు నమోదు కావటంతో మండలవాసులు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. కరోనా బాధితుడిని ఆసుపత్రికి తరలించిన అధికారులు..ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

corona-cases
ప్రశాంత పల్లెలో కరోనా కలకలం

By

Published : May 14, 2020, 8:11 PM IST

కరోనా కేసుతో పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మండలంలోని ఓ గ్రామస్థునికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో కలవరపాటుకు గురయ్యారు. ఈనెల 2న చెన్నైలోని కోయంబేడు వెళ్లి అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆ వ్యక్తకి కరోనా లక్షణాలు కనిపించాయి. అతడిని అధికారులు వెంటనే తాడేపల్లిగూడెం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితుడిని ఏలూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతను గ్రామానికి వచ్చిన వెంటనే ఎవరెవరిని కలిశాడు. ఎక్కడెక్కడ తిరిగాడు... అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామాన్ని రెడ్ జోన్​గా ప్రకటించి దిగ్బంధం చేశారు. గ్రామంలో అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామం కావడంతో పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details