ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ఒక్కరోజే 109 పాజిటివ్ కేసులు - పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. జిల్లాల్లో విరుచుకుపడుతోంది. ఒక్కరోజే 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

corona cases
corona cases

By

Published : Jun 19, 2020, 3:16 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో జిల్లాలో కరోనా కోరలు చాచింది. ఒక్కరోజే 109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 582కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఏలూరు- 36, నరసాపురం- 25, పెదపాడు- 5, భీమవరం-4, అత్తిలి-4, పోడూరు - 3, పెనుమంట్ర - 2, మొగల్తూరు - 2, వీరవాసరం - 2, పాలకొల్లు -2 , చాగల్లు-2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పెదవేగి, పొలకోడేరు, వట్లూరు, వేలివెన్ను, యలమంచలి, తణుకు, యలమంచలి, ఉండి, ఆచంట, పెనుకొండ, నిడదవోలులో ఒక్కోకేసు చొప్పున 11 కేసులు గుర్తించారు. అవేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇలా జిల్లాలో మొత్తం 109 కరోనా పాజిటివ్ కేసులు ఒక్కరోజులో నమోదయ్యాయి. జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో కొత్తగా 9 కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details