పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా పాజిటివ్ గర్భిణికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రసవం చేశారు. ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. పెదపాడు మండలం నారీ కేశ్వరపురం గ్రామానికి చెందిన గర్భిణి ఈనెల 16న కరోనా పాజిటివ్ లక్షణాలతో కోవిడ్ ఆస్పత్రిలో చేరింది. ఆమె భర్త ద్వారా కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి బిడ్డను బయటకు తీశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు కరోనా నిర్ధరణ కోసం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా నెగిటిన్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అరుదైన శస్త్ర చికిత్సతో కరోనా పాజిటివ్ గర్భిణికి ప్రసవం - ఏలూరులో కరోనా కేసులు
ఏలూరులో కరోనా పాజిటివ్ గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు కరోనా నిర్ధరణ కోసం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
corona cases in west godavari