ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకు నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా - పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. పట్టణంలో 2 వేల కేసులు, నియోజకవర్గంలో 2 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. లాక్​డౌన్ సడలింపు, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వంటివి వైరస్ విజృంభించడానికి కారణమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు.

corona cases in tanuku
తణుకులో కరోనా కేసులు

By

Published : Sep 30, 2020, 2:24 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని కరోనా కలవరం సృష్టిస్తోంది. తణుకు పట్టణంలో 2 వేల కేసులు, నియోజకవర్గంలోని 2 మండలాల్లో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు.

కరోనా ప్రారంభ దశలో తణుకు పట్టణం, నియోజకవర్గంలో 50 రోజుల వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. మే నెల 21వ తేదీన తణుకులో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా కేసులు పెరుగుతూ ఇప్పటికి 2 వేల కేసులకు చేరాయి.

మూడు మండలాల్లోనూ కలిపి 2 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ నిబంధనల సడలింపుతో పాటు ప్రజలు సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి కనీస నిబంధనలు పాటించకపోవటంతో కేసులు పెరిగినట్లు వైద్యాధికారులు అభిప్రాయ పడుతున్నారు.

ఇవీ చదవండి..

ఏడాది అప్పు ఐదు నెలల్లోనే!

ABOUT THE AUTHOR

...view details