ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 2:55 PM IST

Updated : Jul 13, 2020, 3:25 PM IST

ETV Bharat / state

బల్లిపాడులో పెరుగుతున్న కరోనా కేసులు... అప్రమత్తమైన అధికారులు

పశ్చిమగోదావరి జిల్లా బల్లిపాడు గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఈ గ్రామంలో ఒకే ఒక్క కేసు నమోదు కాగా తాజాగా 14 మందికి పాజిటివ్​గా నమోదైంది. అధికారులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టారు.

corona cases are increasing in bullipadu village at west godavari
బుల్లిపాడు గ్రామంలో పెరగుతోన్న కరోనా కేసులు

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో ఒకేసారి అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఈ గ్రామంలో ఒకే ఒక్క కేసు నమోదు కాగా తాజాగా 14 మందికి పాజిటివ్​గా నమోదైంది. అధికారులు అప్రమత్తమై పాజిటివ్ నివేదికలు వచ్చిన వారిని అర్ధరాత్రి నుంచి ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామమంతా ప్రత్యేక శానిటైజేషన్ చేయించారు. బయట గ్రామాలతో సంబంధం లేకుండా రహదారులన్నీ దిగ్బంధం చేశారు. గ్రామం నలువైపుల అధికారులతో పహారా ఏర్పాటు చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరిని కలిశారని అధికారులు ఆరా తీస్తున్నారు.

జాగ్రత్తగా ఉండండి

కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాస్కులు ధరించి... సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి:

'ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటే లక్ష్యం'

Last Updated : Jul 13, 2020, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details