పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రోజు కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 70కి చేరుకుంది. ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో కొత్తగా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో 48 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. 22 మంది ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో కొత్తగా ఒక కరోనా కేసు... 70కి చేరిన బాధితులు - corona cases news in west godavari
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనాపై పోరాటంలో అధికారులు చర్యలు ఫలిస్తున్నాయి. రోజు రోజకూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు ఒక కరోనా కేసు మాత్రమే నమోదు కావడం ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 48 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు
28 రోజులుగా కేసు నమోదు కాని పలు రెడ్ జోన్లలో ఆక్షంలను కుదించారు. ఏలూరు వైఎస్ కాలనీ, ఆర్ పేట ప్రాంతాలను రెడ్ జోన్ పరిధి నుంచి తొలగించారు.
ఇదీ చదవండి : విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు