ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా బారిన పడకుండా కో-ఆపరేటివ్ బ్యాంక్ సభ్యుల సహాయం - cooperative bank helps to people at palakoderu

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని అన్ని గ్రామల ప్రజలకు కో ఆపరేటివ్ బ్యాంక్ సభ్యులు తమ వంతు సహాయాన్ని అందించారు. మండలంలోని ప్రతి గ్రామానికి బ్లీచింగ్, కాల్షియం హైపోక్లోరైట్ బస్తాలను పంపిణీ చేశారు. కొన్ని మండలాల్లో కూరగాయలను అందజేశారు.

cooperative bank helps to west godavari people to not get infected from corona virus
కరోనా బారిన పడకుండా కో ఆపరేటివ్ బ్యాంక్ సభ్యుల సహాయం

By

Published : Apr 8, 2020, 6:52 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ పిలుపు మేరకు తమ వంతు సహాయం అందిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని కో ఆపరేటివ్ బ్యాంక్ సభ్యులు తెలిపారు. బ్యాంకు పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు వైరస్ బారిన పడకుండా తమ వంతు సహాయం అందిస్తున్నామన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు బ్లీచింగ్, క్యాల్షియం హైపోక్లోరైట్ బస్తాలను ఆటోల ద్వారా గ్రామ పంచాయతీలకు తరలించారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు చేతికి గ్లౌజులు కూడా అందించారు.

ఇదీ చదవండి:పేదలకు పోషకాహార వస్తువులు పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details