ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాం.. ఆదుకోండి' - ఏలూరులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లేబర్ జోనల్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇసుక, కొవిడ్ -19వల్ల ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు.

ఏలూరు లేబర్ జోనల్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా
ఏలూరు లేబర్ జోనల్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా

By

Published : Aug 12, 2020, 2:39 PM IST

ఇసుక కొరత, కొవిడ్ -19 వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లేబర్ జోనల్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్ టీయూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

ఇసుక కొరత వల్ల నిర్మాణాలు మందగించాయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి తోడు కరోనా వల్ల పనులు ఉండటం లేదని వారు తెలిపారు. గత ఏడాదిగా పనులు లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికులను.. ప్రభుత్వమే ఆదుకోవాలని, భవిష్యత్తుపై భరోసా కల్పించాలని నినాదాలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details