Polavaram construction work: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రాధానమైన స్పిల్‌వే గేట్లను పూర్తిగా అమర్చారు. స్పిల్‌వేలో మొత్తం 48 రేడియల్ గేట్లు ఉండగా... గతంలో 42 గేట్లను అమర్చారు. మిగిలిన 6 గేట్లు అమర్చడంతో మొత్తం గేట్ల అమరిక పూర్తయిందని గుత్తేదారు సంస్థ వెల్లడించింది. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గత సీజన్‌లో వరదలు వచ్చేనాటికి 42 గేట్లు అమర్చి.. నీటిని దిగువకు విడుదల చేశారు.
Polavaram works: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి.. - Polavaram construction work
Polavaram construction work: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రాధానమైన.. స్పిల్‌వే గేట్లను పూర్తిగా అమర్చారు. స్పిల్ వేలో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం సైతం పూర్తికావచ్చింది.
రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లు అమర్చారు. త్వరలోనే మిగిలిన 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 10 రివర్ స్లూయిజ్ గేట్లకు... 20హైడ్రాలిక్ సిలిండర్లతోపాటు 10 పవర్ ప్యాక్ సెట్లను అమర్చడం పూర్తయింది. స్పిల్ వే కాంక్రీట్ పనులు 97.25 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. స్పిల్ వేలో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం సైతం పూర్తికావచ్చింది.
ఇదీ చదవండి:ఆమె చదివింది ఎనిమిదే.. కానీ బ్యాంక్ ఛైర్‌పర్సన్ అయ్యింది..!