విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివితే సులభంగా ర్యాంకులు సాధించి... ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఈఈ మెయిన్స్‌కు క్వాలిఫై అయిన విద్యార్థులు మరెందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ కార్యక్రమంలో జేఈఈ మెయిన్స్‌కు క్వాలిఫై అయినా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కలెక్టరు తమకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని జేఈఈ మెయిన్స్‌కు క్వాలిఫై అవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
జేఈఈ మెయిన్స్ క్వాలిఫై విద్యార్థులకు "స్ఫూర్తి" అభినందన సభ - జేఈఈ మెయిన్స్‌కు క్వాలిఫై అయినా విద్యార్ధుల వార్తలు
జేఈఈ మెయిన్స్‌కు క్వాలిఫై అయినా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్‌లో స్ఫూర్తి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
![జేఈఈ మెయిన్స్ క్వాలిఫై విద్యార్థులకు "స్ఫూర్తి" అభినందన సభ congratulatory session for students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5769981-464-5769981-1579493299178.jpg)
విద్యార్థులకు "స్ఫూర్తి" అభినందన సభ