పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజుపై వైకాపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉండి ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహరాజుకు సంబంధం లేకుండా పాదయాత్ర నిర్వహిస్తున్నారు వైకాపా నాయకులు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో గ్రామ కన్వీనర్ కలిదిండి శ్రీనివాసవర్మ పాదయాత్ర నిర్వహించారు. గతంలో నియోజకవర్గ నాయకుడి వల్ల అన్యాయం జరుగుతుందని ఆమరణ నిరాహార దీక్ష చేశారు శ్రీనివాసవర్మ.
ఉండిలో తారాస్థాయికి చేరిన వైకాపా నేతల మధ్య విభేదాలు - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గ ఇంఛార్జ్ నరసింహరాజుకు సంబంధం లేకుండా.. వైకాపా నేతలు పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఉండిలో వైకాపా నేతల మధ్య విభేదాలు
రెండు రోజుల కిందట కోరుకొల్లులో నియోజకవర్గ కన్వీనర్ నరసింహరాజు లేకుండా పాదయాత్ర చేశారు యువజన అధ్యక్షుడు మంతెన యోగేంద్ర కుమార్. వైకాపా నాయకులు మధ్య వివాదాలు చెలరేగడంతో కార్యకర్తలు ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉండి నియోజకవర్గంలోని వైకాపాలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా పాలకోడేరు మండలం తరచూ చోటుచేసుకుంటున్న ఇటువంటి పరిణామాలను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇదీ చదవండి: