పశ్చిమగోదావరిలోని పాలకోడేరు మండలం మోగల్లులో.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాసాభాసగా మారింది. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, నియోజకవర్గ వైకాపా కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజుల మధ్య.. సభలో మాటల యుద్ధం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పోలీసులు కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.
పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో.. తనపై ఏ కేసులూ లేవని, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పేర్కొన్నారు. వివాదాలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఈలోపు వైకాపా కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు అడ్డుతగిలి.. తమపైనా కేసులు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటామాటా పెరిగి వివాదానికి దారితీసి.. ఒక్కసారిగా వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది.