తక్షణమే మినీ గోకులం బిల్లులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు గురువారం ఆందోళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి వద్ద జరిగిన ఈ నిరసనలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ పాల్గొన్నారు.
'మినీగోకులం బిల్లులు చెల్లించండి' - west godavari
మినీ గోకులం బిల్లులను వెంటనే చెల్లించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో పాడి రైతులు ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పాడి రైతుల ఆందోళన
రాష్ట్రంలో 32 వేల మంది రైతులు మినీ గోకులం షెడ్లు నిర్మించుకున్నారని, ఏ ఒక్క రైతుకూ బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. పాడి రైతుల సమస్యలపై శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామంటే పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామనడం దారుణమని జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు.
ఇదీచదవండి.