కడప జిల్లా మైదుకూరు పురపాలక లక్ష్మీనరసింహ స్వామి దర్గా సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పాత ప్రహరీ గోడ కూలింది. ఏడాది కిందట హాస్టల్లో నూతన ప్రహరీ గోడ నిర్మించారు. ఆ తర్వాత పాత ప్రహరీ తొలగించాల్సిన అధికారులు విస్మరించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాల ప్రాంగణంలోకి నీరు చేరి.. ఒక్కసారిగా ప్రహరీతో పాటు విద్యుత్తు స్తంభం కూలిపోయింది. విద్యార్థులంతా పాఠశాలకు వెళ్లిన తర్వాత ప్రహరీ కూలటంతో పెను ప్రమాదం తప్పింది.
'మైదుకూరు బాలికల వసతి గృహంలో కూలిన ప్రహరీ' - kadapa district
అధికారుల నిర్లక్ష్యం వల్ల మైదుకూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పాత ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది.
'మైదుకూరు బాలికల వసతి గృహంలో కూలిన ప్రహరీ'