ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకు నియోజకవర్గంలో సంపూర్ణ లాక్ డౌన్ - west godavari dst lockdown updates

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు బంద్​కు పిలుపునిచ్చారు. అత్యవసరాలు మినహా అన్నీ దుకాణాలు మూతపడే ఉన్నాయి.

complete lockdwon in west godavari dst thanuku consistency
complete lockdwon in west godavari dst thanuku consistency

By

Published : Jul 19, 2020, 2:16 PM IST

కరోనా వైరస్ నివారణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు పూర్తి బంద్​కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు, ఔషధ దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూసివేశారు.

రెడ్ జోన్ ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తుండటం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ పరిధిలో దుకాణాల అనుమతి సమయాన్ని కుదించారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలలో అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో పట్టణ పరిధితో పాటు అత్తిలి మండల గ్రామాలలో కేసులు విజృంభిస్తుండటంతో అధికారులు మరింత పకడ్బంది చర్యలు చేపట్టారు.

ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని 15 గ్రామాల్లో అధికారులు పూర్తి బందుకు పిలుపునిచ్చారు. బంద్ కారణంగా మండల గ్రామాల్లోని ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చూడండి

ఆ బిల్లులు చట్ట వ్యతిరేకం'.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details