పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు కట్టిదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి దుకాణాలు మూసివేశారు. ఈ నెలాఖరు వరకు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయల దుకాణాలే ఉదయం 11 గంటల వరకు అనుమతిస్తున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులతో తణుకు దిగ్బంధం - corona cases in west godavari district
కరోనా వైరస్ విజృంభణతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అధికారులు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వైపుల దారులు మూసివేసి ప్రధాన రహదారులతో సహా అన్ని వైపుల దిగ్బంధించారు.
తణుకులో పూర్తి లాక్ డౌన్
పట్టణంలోకి ప్రవేశించే అన్ని వైపులా రహదారులు దిగ్బంధించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏ ఒక్కరూ రాకుండా చర్యలు చేపట్టారు. వైద్య సేవలు, ఔషధాల కోసం వచ్చేవారినే నిర్ధరించుకొని లోపలికి అనుమతిస్తున్నారు. పోలీసులు చేపట్టిన పకడ్బందీ చర్యలతో అన్ని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
ఇవీ చూడండి...