ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు.. సామాన్యుల ఆపన్నహస్తం - పశ్చిమ గోదావరిలో వరద వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని కొల్లేరు తీర ప్రాంత వరద బాధితులకు దాతలు అండగా నిలుస్తున్నారు. నిరుపేదలకు మంచినీరు, నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణీ చేస్తున్నారు.

common people help to flood victims
వరద బాధితులకు నిత్వావసరాల పంపిణీ

By

Published : Oct 27, 2020, 3:45 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో వరద నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి కొంతమంది సహాయం అందిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న నిరుపేదలకు ఆహారం, దుస్తులు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కొల్లేరు తీర ప్రాంతాలు వరద నీటిలో ఉన్నాయి.

కనీసం నిత్యావసరాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుని తిండిలేక ఇబ్బంది పడుతున్న వారికి ఆకివీడుకు చెందిన ఏసుపాదం అనే వ్యక్తి సహాయం అందిస్తున్నారు. నిరుపేదలకు మంచినీరు, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details