Commissioner of fisheries kannababu on GO 217: జీవో 217పై దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో 217 జారీ చేశామని స్పష్టం చేశారు. 27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న 582 చెరువులకే ఈ జీవో వర్తిస్తుందని వెల్లడించారు. 337 చెరువుల్లో 255 మత్స్యకార సంఘాలు చేపలు పడుతున్నాయని వెల్లడించారు.
నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ జీవో అమలు చేస్తున్నామని కన్నబాబు పేర్కొన్నారు. నెల్లూరులో విజయవంతమైతే మిగతా చోట్లకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు. మిగిలిన 310 చెరువుల్లో ఇంకా జీవో అమలు చేయడం లేదన్నారు. మత్స్యకార సంఘాలకు మరింత ఆదాయం వచ్చేందుకే జీవో అమలు చేస్తున్నామన్న ఆయన.. దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 100 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.
"జీవో 217పై దుష్ప్రచారం జరుగుతోంది. మత్స్యకారుల అభ్యున్నతి కోసం జీవో 217 ఇచ్చాం. 27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వంద హెక్టార్ల కంటే ఎక్కువున్న 582 చెరువులకే జీవో వర్తిస్తుంది. 337 చెరువుల్లో 255 మత్స్యకార సంఘాలు చేపలు పడుతున్నాయి. నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద జీవో అమలు చేస్తున్నాం. మిగతా 310 చెరువుల్లో ఇంకా జీవో అమలు చేయడం లేదు' - కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్