పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్‌లో పనులు చేస్తున్న కార్మికులను కరోనా కారణంగా వారి రాష్ట్రాలకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ లో కార్మికులు పనులు మానేసి తమ రాష్ట్రాలకు పంపాలంటూ కొద్దీ రోజులుగా ఆందోళన బాటపట్టారు. ఇటీవల కాపర్ డ్యామ్ మీదుగా తూర్పుగోదావరి జిల్లాకు కాలినడకన చేరుకోగా అక్కడి నుంచి పోలీసులు వెనక్కి పంపివేశారు. జిల్లా అధికారులు వారి సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడంచో ఎంత మందిని ఏయే రాష్ట్రాలకు తరలించాలి అన్న స్పష్టతకు కలెక్టర్ వచ్చారు. క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలోనే కార్మికులకు అన్ని పరీక్షలు నిర్వహించి వారి రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లలో పంపుతామన్నారు.
'పోలవరం కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు' - polavaram latest updates
పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాటపట్టారు. కరోనా వైరస్ వల్ల పనులు మానేసి తమ రాష్ట్రాలకు పంపాలని నిరసన చేశారు. కాపర్ డ్యామ్ మీదుగా కాలినడకన వస్తున్నవారిని పోలీసులు వెనక్కి పంపారు.
అధికారులతో సమావేశమైన కలెక్టర్