సమస్య పరిష్కరం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఓ వృద్ధురాలిని.. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తకోటకు చెందిన పిప్పళ్ల చంద్రమ్మ తన భూ సమస్యను పరిష్కరించాలని కోరడానికి బుధవారం మెట్లు ఎక్కి కలెక్టర్ ఛాంబరు వరకు వెళ్లారు. అదే సమయంలో బయటకు వెళుతున్న కలెక్టర్ ఆమెను జేసీ ఛాంబర్లోకి తీసుకెళ్లి తాగడానికి మంచినీరు ఇచ్చి, సమస్యను తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.
కలెక్టర్ స్పందనతో వృద్ధురాలికి ఊరట - CollectorKartikeya Mishra Latest Information
‘‘ఈ వయసులో నా కోసం మెట్లు ఎక్కి వచ్చారు. మీరు వచ్చారని తెలిస్తే నేనే కిందకు వచ్చేవాణ్ని కదమ్మ" అంటూ ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు కలెక్టర్. ఆమె సమస్యను తెలుసుకొని తప్పకుండా పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు. ఆయన స్పందన చూసి ఆమె ఎంతో సంతోషించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగింది.

కలెక్టర్ కార్తికేయ మిశ్రా