పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కరోనా రోగి దొరబాబు.. గుండెపోటుతో మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. సీవియర్ డయాబెటిస్ పేషెంట్ దొరబాబు.. మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని తేల్చి చెప్పారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని వివరించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని... బాధితులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.