ఏలూరులో ప్రబలుతున్న వింతవ్యాధికి గల కారణాలను గుర్తించేందుకు జాతీయ ఆహార పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు నమూనాలు సేకరించారు. పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో నీటి నమూనాలు, పాలు, కూరగాయలు, బియ్యం, డంపింగ్ యార్డుల నుంచి నమూనాలు తీసుకున్నారు. ఈ నమూనాలపై పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నట్టు ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు ఈటీవీ-ఈటీవీ భారత్కు వెల్లడించారు. ప్రాథమికంగా కొన్ని ఫలితాలు శుక్రవారానికి వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఏలూరు ఘటన కారణాల అన్వేషణకు నమూనాలు సేకరణ
ఏలూరు అస్వస్థత ఘటనకు గల కారణాల అన్వేషణకు జాతీయ ఆహార పరిశోధనా సంస్థ రంగంలోకి దిగింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నీరు, పాలు, కూరగాయల నమూనాలు సేకరించి విశ్లేషణ చేయనుంది.
ఏలూరు ఘటన కారణాల అన్వేషణకు నమూనాలు సేకరణ