కోడిపందాల్లో కోడి కాళ్లకు కట్టడానికి ఉపయోగించే కత్తుల తయారీ కేంద్రంపై పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఊరు శివాలయం వీధిలో కోడి కత్తులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పట్టణ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడి చేసి కత్తులు తయారీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. తయారీ కేంద్రంలో ఉన్న వెయ్యికి పైగా కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోళ్లకు కత్తులు కట్టే మండపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి కోడిపందాలు, పేకాటలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ హెచ్చరించారు.
తణుకులో వెయ్యికి పైగా కోడిపందేల కత్తుల స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ - పశ్చిమగోదావరి జిల్లా తణుకు
కోడిపందాల్లో కోడి కాళ్లకు కట్టడానికి ఉపయోగించే కత్తుల తయారు చేస్తున్న కేంద్రంపై తణుకు పోలీసులు దాడి చేశారు. తయారీ కేంద్రంలో వెయ్యికి పైగా కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి కోడిపందాలు, పేకాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తణుకు సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ హెచ్చరించారు.
తణుకులో వెయ్యికి పైగా కోడిపందేల కత్తుల స్వాధీనం