సంక్రాంతి సంబరాలు.. తరలి వచ్చిన తెలంగాణ వాసులు - పశ్చిమగోదావరిలో సంకాంత్రికి సంగారెడ్డి వాసులు
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో సంకాంత్రి సందర్భంగా కోడిపందాలు జోరుగా సాగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ కోడిపందాలు నిర్వహించారు. భీమవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు, వీరవాసరం తదితర మండలాల్లో కోడిపందేలు భారీగా జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పోలీసులు చాలాచోట్ల కోడి పందేల బరులు కూల్చివేశారు. మరోవైపు కోడిపందేల్లో పాల్గనేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు భారీగా తరలివచ్చారు.
సంక్రాంతి సంబరాలు
TAGGED:
cock fights at bheemavarm