పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందేలు అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నం చేస్తోంది. పలు గ్రామాల్లో అధికారులు తనిఖీలు చేసి... పదుల సంఖ్యలో కోడిపందేల బరులు ధ్వంసం చేశారు. బరుల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, కంచెలు, ఇతర ఏర్పాట్లను అధికారులు తొలగించారు. ప్రతిఘటించిన వారిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. బరులు ధ్వంసం చేసే సమయంలో కోడిపందేల నిర్వాహకులు, అధికారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. సంక్రాంతికి ఆచారంగా నిర్వహించే కోడిపందేలను అధికారులు అడ్డుకోవడంపై ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ కారణంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు వెనక్కు తగ్గుతున్నారు. జిల్లాలో సంక్రాంతి పందెం కోడికి, అధికార యంత్రాంగానికి సాగుతున్న పోటాపోటీ ఆటపై.. మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.
కోడి పందేలు : పోలీసులు - నిర్వాహకుల మధ్య వాగ్వాదాలు - sankrati celebrations in west godavari
పందేలకు బరులు సిద్ధమయ్యాయి. అడ్డుకునేందుకు పోలీసులూ రెడీ అంటున్నారు. ఏం జరిగినా.. పందెం పెట్టాల్సిందే అని నిర్వాహుకులు సై అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో.. ఇదే హడావుడి కనిపిస్తోంది.
cock fight starts in West godavari