Cock Fight under Lights: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కోడిపందేలు భారీగా కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన కోడిపందాలు రాత్రి పొద్దుపోయే వరకు లైట్ల వెలుగులలో జరిగాయి. పందెం రాయుళ్లు.. తమ కోళ్లతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేచి ఉండటంతో.. కోడిపందేల నిర్వాహకులు రాత్రి సమయంలో కూడా పందేలు నిర్వహించారు. దీంతో పాటు గుండాటలు పొద్దు పోయే వరకు కొనసాగాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్వాహకులు భారీ స్థాయిలో విద్యుత్ లైట్లు ఏర్పాట్లు చేయడంతో నిరాటంకంగా పందేలు కొనసాగాయి.
విద్యుత్ లైట్ల నడుమ జోరుగా కోడి పందేలు - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
Cock Fight under Lights: సంక్రాంతి సంబరాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న కోడిపందేలు ఫ్లడ్ లైట్ల వెలుగులలోనూ కొనసాగాయి. కోడిపందాలతో పాటు గుండాటలు జోరుగా జరిగాయి. నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేచి ఉన్నారు.
కోడి పందేలు