పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని చేబ్రోలు సొసైటీ కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ.12.5 లక్షలు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పంపిణీ చేశారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గానికి సీఎం సహాయనిధి నుంచి 260 మందికి రూ.49.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ రమావతి, వైకాపా మండల కన్వీనర్ మంగారావు, సొసైటీ చైర్మన్ పాపారావు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలోని చేబ్రోలు సొసైటీ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేశారు. నియోజకవర్గానికి 260 మందికి రూ.49.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే