ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్రమంత్రి - కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఏపీ టూర్

Central Minister Shekhawat : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. రేపు పరిశీలించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. గోదావరి జిల్లాల్లోని నిర్వాసితులతో మట్లాడనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

Central Minister Shekhawat , jagan
Central Minister Shekhawat , jagan

By

Published : Mar 3, 2022, 7:09 PM IST

Updated : Mar 3, 2022, 7:57 PM IST

Central Minister Shekhawat visit polavaram : రేపు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను, పునరావాస కాలనీలను సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పరిశీలించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడి నిర్వాసితులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించి... జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.

Last Updated : Mar 3, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details