CM JAGAN WEST GODAVARI TOUR: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ ఇవాళ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు.
CM TOUR: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం పర్యటన - cm west godavari tour
CM JAGAN WEST GODAVARI TOUR: ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
రేపు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం పర్యటన
సీఎం తొలుత మహిళా కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి వెంబడి బహిరంగ సభ జరిగే బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తాడేపల్లి తిరిగి వెళతారు. ముఖ్యమంత్రి జన్మదినం కావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశం రద్దు..!
Last Updated : Dec 21, 2021, 5:25 AM IST