JAGAN POLAVARAM TOUR: ఈ నెల 19న పోలవరానికి సీఎం జగన్ - polavaram project latest news
20:33 July 16
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan).. ఈ నెల 19న పోలవరం ప్రాజెక్టు(polavaram project)ను సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో సీఎం పోలవరానికి బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యామ్(coffer dam), తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ప్రాజెక్టు ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తారు. నిర్వాసితులకు అందించాల్సిన సహాయక చర్యలు, పరిహారంపై(exgrasia) అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
ముందుగా ముఖ్యమంత్రి జగన్ (cm jagan) ఈ నెల 14న.. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటన వాయిదా పడింది. ఫలితంగా సీఎం జగన్.. ఈ నెల 19న పోలవరంలో పర్యటించనున్నారు.
ఇవీచదవండి.