ఈ నెల 14న సీఎం జగన్ (cm jagan) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ పోలవరానికి వెళ్లారు. వర్షాల సీజన్ ప్రారంభం కావటంతో గోదావరి (godavari river)లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 27 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. దీంతో కాఫర్ డ్యామ్ ఎగువన ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించే పనులు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో నిర్వాసితుల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశమున్నట్టు జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు.