ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసుల భయంతోనే కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు' - మూడు రాజధానులు

బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడానికి సీఎం అసమర్థతే కారణమని... తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. చంద్రబాబుపై కోపంతోనే మూడు రాజధానుల ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో భూ ఆక్రమణలకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

bonda uma
bonda uma

By

Published : Feb 2, 2020, 10:13 PM IST

తణుకులో మాట్లాడుతున్న బొండా ఉమ

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరగటానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థతే కారణమని... తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్​ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన లేకపోవటంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై కేసులు ఉన్నందునే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని ధ్వజమెత్తారు.

సినీనటుడు మోహన్‌బాబు కలవటానికి అవకాశమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ను పక్కన పెట్టే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబుపై కోపంతోనే 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని న్యాయ రాజధాని ఏర్పాటుపై ఎలా తీర్మానం చేస్తారని మండిపడ్డారు. విశాఖలో వైకాపా నేతలు 30 వేల ఎకరాలను కొనుగోలు చేశారని బొండా ఉమ ఆరోపించారు. వాల్తేరు క్లబ్‌, దసపల్లా, తదితర భూములను ఢీనోటిఫైడ్‌ చేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఉమ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి మొండిచేయి: ఎంపీ విజయసాయిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details