ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

వరద ముంపు ప్రాంతాలను సీఎం జగన్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సహా సమీపంలో ముంపు ప్రాంతాల పరిస్ధితిని వీక్షించారు.

cm jagan arial view  at flooded area
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

By

Published : Aug 18, 2020, 3:41 PM IST

Updated : Aug 18, 2020, 8:26 PM IST

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. సీఎంతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్ని నాని ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించారు. కృష్ణా జిల్లాలో బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ముంపునకు గురైన పంటపొలాలు, ప్రాంతాలను వీక్షించారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్దృతిని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. పెద్దఎత్తున నీట మునిగిన పంటలను చూశారు.

పోలవరం ప్రాజెక్టు సహా సమీపంలో ముంపు ప్రాంతాల పరిస్ధితిని పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో అందుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై సీఎం ఆరా తీశారు. ముంపు ప్రాంతాల సమాచారాన్ని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. అనంతరం వరద సహాయక చర్యలపై రాజమహేంద్రవరంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక సాయంపై ప్రభుత్వ ఉత్తర్వులు

గోదావరి జిల్లాల వరద బాధితులకు ఆర్థికసాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత కుటుంబానికి రూ.2 వేలు చొప్పున చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొంటూనే బాధితులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించింది.

ఇదీ చదవండి:

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

Last Updated : Aug 18, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details