Clash Between Two Families: పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామంలో అన్నదమ్ముల మధ్య స్థల వివాదం కొట్లాటకు దారితీసింది. గ్రామానికి చెందిన కాకరాల మల్లయ్య, కాకరాల ఇజ్రాయిల్ ఇద్దరు వరుసకు అన్నదమ్ములు అవుతారు. గత పంచాయతీ ఎన్నికల్లో వీరి కుటుంబాల నుంచి ఇరువురు మహిళలు వార్డు స్థానానికి పోటీ చేశారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం - latest news in west godavari
Clash Between Two Families: గత పంచాయతీ ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారి, అది కాస్తా కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం
ఈ క్రమంలో స్థలం సరిహద్దు విషయంలో ఇరు కుటుంబాల వారు మళ్లీ గొడవ పడ్డారు. మాటామాటా పెరిగి ఈ ఘర్షణ కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా, ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. చాలా మంది పోటీలో ఉన్నారన్న సీఎం జగన్..!