పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమానికి ఆటంకం ఎదురైంది. ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు బుధవారం శ్రీకారం చుట్టగా ఆ స్థలం మాది అంటూ పోలీస్ శాఖ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం చోటుచేసుకుంది. జీలుగుమిల్లి పంచాయతీలోని 45 మంది అర్హులను గుర్తించి ఎకరం స్థలాన్ని రెవెన్యూ అధికారులు అభివృద్ధి చేశారు. లేఅవుట్లు సిద్ధం చేసి సరిహద్దు రాళ్ళు కూడా పాతారు..
వాళ్లు కేటాయించారు.. వీళ్లు అడ్డుకున్నారు.! - జీలుగుమిల్లి ఎమ్మార్వో తాజా
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో వివాదం చోటుచేసుకుంది. అర్హులకు కేటాయించిన స్థలం తమదేనంటూ పోలీసు శాఖ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య వివాదం రావడంతో ఇప్పడు లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
రెవెన్యూ శాఖ అధికారులు ఈ స్థలం వద్ద దేవస్థానం వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా.. పోలీసులు మంగళవారం ఈ స్థలం తమది అంటూ ఫ్లెక్సీ సిద్ధం చేయడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఈ ఎకరం ఇళ్ల స్థలాల కోసం చదును చేయడానికి నాలుగు లక్షల రూపాయలను వెచ్చించగా.. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజాధనం వృధా అయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు శాఖల మధ్య వివాదం రావడంతో ఇప్పడు లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఈ సంఘటనపై ఎస్సై విశ్వనాథ బాబును వివరణ కోరగా రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం పోలీస్ శాఖ చెందినదిగా ఉందన్నారు స్పష్టంచేశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. తహసీల్దార్ గడ్డం ఎలిషాను వివరణ కోరగా పోలీస్ శాఖకు చెందినదే అయినా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిపై తాము కూడా ఉన్నతాధికారులకు నివేదిక అందించామని వివరించారు.
ఇదీ చదవండి:లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని