Clash between BTech students: ప్రేమించిన యువతి విషయంలో కొందరు యువకులు... మరో యువకుడిని చావబాదిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో చోటు చేసుకుంది. భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు... ఓ యువతి విషయంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ప్రవీణ్ అనే యువకుడు... మరో ముగ్గురు యువకులతో కలిసి అంకిత్ అనే యువకుడిని చితక బాదారు. కర్రలు, పైపులతో విచక్షణారహితంగా కొట్టారు. బాధిత విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ విషయంలో గొడవ... విద్యార్థిని చితకబాదిన మరో నలుగురు - పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ
Clash between BTech students: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమ విషయంలో బీటెక్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు కలిసి మరో విద్యార్థిని కర్రలతో చితకబాదారు. అసలేం జరిగిందంటే..?
బీటెక్ విద్యార్థుల మధ్య ఘర్షణ
Last Updated : Nov 5, 2022, 2:17 PM IST