పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో.. ఇంటి నుంచి బ్యాంకుకి వెళ్తున్న లక్ష్మీ అనే మహిళపై ఓ దుండగుడు మత్తు మందు చల్లాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. ఆమె హ్యాండ్ బ్యాగ్‌ని బ్లేడుతో కత్తిరించి.. 1,90,000 రూపాయల నగదును దోచేశాడు. హైదరాబాదులో ఉన్న తన కూతురి గృహ ప్రవేశం కోసం అకౌంట్లో డబ్బులు వేయడానికి మోగల్లు ఎస్బీఐకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అక్కడే పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు.. వివరాలు తెలుసుకొని ఇంటికి చేర్చారు. సంఘటనపై కేసు నమోదు చేసిన పాలకోడేరు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
సినీ ఫక్కీలో దోపిడి.. ఒంటరి మహిళపై మత్తు చల్లి..! - మెగల్లులో దోపిడి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. బ్యాంకుకు వెళ్తున్న ఒంటరి మహిళపై మత్తు మందు చల్లి.. ఆమె వద్ద ఉన్న నగదుతో పారిపోయాడు ఓ ఆగంతకుడు.
సినీ ఫక్కీలో దోపిడి.. ఒంటరి మహిళపై మత్తు జల్లి..!