ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ రఘురామను అందుకే అరెస్టు చేశాం.. సీఐడీ ప్రకటన - MP Raghu Rama Arrest News

రఘురామ అరెస్టుపై సీఐడీ ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీ రఘురామపై అభియోగం నమోదు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఎంపీ రఘురామపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని సీఐడీ వెల్లడించింది.

సీఐడీ ప్రకటన
సీఐడీ ప్రకటన

By

Published : May 14, 2021, 7:48 PM IST

నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ అరెస్టుపై సీఐడీ ప్రకటన విడుదల చేసింది. సీఐడీ అదనపు డీజీపీ సునీల్‌కుమార్‌ తరఫున ప్రకటన విడుదలైంది. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీ రఘురామపై అభియోగం నమోదు చేసినట్టు సీఐడీ పేర్కొంది. సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని ఎంపీపై అభియోగం నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చారని రఘురామపై అభియోగం మోపారు. ఎంపీ రఘురామపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని సీఐడీ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details