ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమ గోదావరిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - rcm church latest news update

పశ్చిమ గోదావరి జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోతునూరు ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. పాపులను రక్షించడానికే ఏసు పుట్టారని కొనియాడారు.

Christmas grand celebrations at Pothunur RCM Church
పోతునూరు ఆర్సీఎం చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 25, 2020, 10:42 AM IST

అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తు జననానికి సంబంధించి వాక్యలు చదివి వినిపించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోతునూరు ఆర్సీఎం చర్చి ఫాదర్ డేవిడ్ రాజు వాక్యోపదేశం చేస్తూ క్రీస్తు జననం లోకంలోని పాపాలు తొలగించడానికి ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరు జీవించడానికి పుడతారని ఏసుక్రీస్తు మాత్రం పాపులను రక్షించి మరణించడానికి పుట్టారని కొనియాడారు. డప్పు వాయిద్యాలు టపాసులతో యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

స్కూటీని ఢీ కొట్టిన లారీ... ఇద్దరు యువతులు మృతి

ABOUT THE AUTHOR

...view details