కరోనా సమయంలో వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు పంపించటంలో సినీనటుడు సోనుసూద్ చేసిన కృషి అభినందనీయమని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తన ఇద్దరు కుమార్తెలతో పొలం దున్నటంపై ఆయన స్పందించారన్నారు. రైతుకు ట్రాక్టర్ను అందించటం మానవతా దృక్పథానికి ప్రతీక అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తనకు స్ఫూర్తి అని సోనూసూద్ చెప్పడం అభినందించ దగ్గ విషయమన్నారు. రైతు కుమార్తెలు ఇద్దరిని చంద్రబాబు నాయుడు చదివిస్తానని చెప్పడం మరింత అభినందించదగ్గ విషయమన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సోనూసూద్లను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు.
'చంద్రబాబు, సోనూసూద్లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి' - చిత్తూరు ట్రాక్టర్ న్యూస్
చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తన ఇద్దరు కుమార్తెలతో పొలం దున్నటంపై సినినటుడు సోనుసూద్ స్పందించి వారికి ట్రాక్టర్ను అందించటం అభినందనీయమని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ