ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2022, 5:32 PM IST

ETV Bharat / state

అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది: చిరంజీవి

స్వాతంత్య్రం కోసం తెల్లవారిని ఎదిరించిన ధీరుడిగా.. అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయారని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొనియాడారు. మన్యంవీరుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు.

చిరంజీవి
చిరంజీవి

మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. స్వాతంత్య్రం కోసం తెల్లవారిని ఎదురించిన ధీరుడిగా అల్లూరి చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాంటి మహనీయుడిని స్మరించుకుంటూ 30 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.

తెలుగుజాతి వాడీవేడిని బ్రిటీష్ వారికి రుచిచూపించిన గొప్ప వ్యక్తి అల్లూరి అని.. క్షత్రియ సేవా సమితి ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు అన్నారు. అల్లూరి పేరు తలచుకుంటే పొంగని తెలుగు హృదయం ఉండదన్నారు. తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.

అల్లూరికి మోదీ ఘన నివాళి: ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్​తో కలిసి ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details