'అంతా కుట్ర' - social media
తనకు దళితులంటే గౌరమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు.
తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొందరుదుష్ప్రచారాలు చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. గతేడాది నవంబరు 15న శ్రీరామవరం గ్రామదర్శినిలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ... కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. దళిత వర్గమంతా తనకు వెన్నుదన్నుగా ఉందని స్పష్టం చేశారు. వారి అభివృద్ధి కోసం ఎన్నో చేశానని, వారిపట్ల తనకెంతో గౌరవముందని తెలిపారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రస్తావించడం రాజకీయ కుట్ర అని విమర్శించారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవారికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ చేసి.. జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించినట్టు చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రవిప్రకాష్‌ను కోరామన్నారు.