రాజధాని రైతులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి.. నేడు ప్రాంతాల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కావాలంటే ప్రజాభిప్రాయం తీసుకుని రాజధానిని మార్చాలన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
'నాడు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి.. నేడు రాజధానిని మారుస్తారా' - అమరావతిపై చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి.. నేడు మూడు రాజధానులంటూ జగన్ మాట్లాడడం దారుణమని తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా దెందులూరులో నిరసన దీక్ష చేపట్టారు.

అమరావతికి మద్దతుగా దీక్ష